
చర్ల, ఆగస్టు 15: చర్ల మండలంలోని కేశవాపురం గ్రామపంచాయతీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాపుల శారద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కాపుల శారద మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధితో పాటు పరిశుభ్రత, విద్య, సామాజిక బాధ్యతల పట్ల ప్రతి పౌరుడు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు.
అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు దేశభక్తి భావాన్ని పెంపొందించుకుని విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాపుల శారద, ఉప సర్పంచ్ సతీష్, పంచాయతీ కార్యదర్శి, శ్యాం కుమార్, సీనియర్ నాయకులు నాగరాజు, కోటేశ్వరరావు, రాధ, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, గ్రామ యువత, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.









