పలాస, ఆగస్టు 15 (వై7 న్యూస్): పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జర్నలిస్టులందరూ సగౌరవంగా జాతీయ పతాకానికి వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో పత్రికలు, పాత్రికేయులు పోషించిన కీలక పాత్రను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి సమాజ హితం కోసం నిష్పాక్షికంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ వేడుకల్లో పలాస నియోజకవర్గానికి చెందిన వివిధ దినపత్రికలు, న్యూస్ ఛానళ్ల విలేఖరులు, ఫొటో జర్నలిస్టులు, జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.









