తెలంగాణ , ఆగస్ట్ 04 (వై 7 న్యూస్);
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదులు, వాగులు, చెరువుల సమీపంలో నివసించే వారు ప్రత్యేక అప్రమత్తత పాటించాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, విద్యుత్ స్తంభాలు, చెట్లు మరియు నీటితో నిండిన రహదారుల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Post Views: 50









