E-PAPER

తల్లి కాబోతున్న సమంత?.. నెట్టింట బేబీ బంప్ ఫొటోలు వైరల్!

కథానాయిక సమంత అభిమానులకు త్వరలోనే ఒక తియ్యటి కబురు చెప్పబోతున్నారా? రీసెంట్‌గా తాను స్వయంగా నిర్మించి, నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానం టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గత రెండు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల వేదికగా సమంత తల్లికాబోతున్నారనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.

తాజాగా జరిగిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ వేడుకలో ఆమె ‘బేబీ బంప్’తో కనిపించినట్లు ఉన్న కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే విషయమై ఆమె సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సమంత గర్భవతి అనే వార్త నిజమేనని అంటున్నప్పటికీ, ఈ విషయంపై అటు సామ్ కానీ, ఇటు ఆమె భర్త రాజ్ కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

సమంత, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు గతేడాది వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ప్రసిద్ధ ఈశా యోగా కేంద్రంలో అత్యంత పవిత్రమైన ‘భూతశుద్ధి’ వివాహ విధానంలో వీరి పెళ్లి సింపుల్‌గా జరిగింది. గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’, అలాగే అంతర్జాతీయ సిరీస్ భారతీయ వెర్షన్ ‘సిటడెల్: హనీ బన్నీ’ కోసం కలిసి పనిచేస్తున్న సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. సమంత కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన లేటెస్ట్ హిట్ ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి రాజ్ నిడిమోరు కథ అందించగా, సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవీస్’ పతాకంపై దీనిని నిర్మించారు. అటు ప్రొఫెషనల్ లైఫ్‌లో, ఇటు పర్సనల్ లైఫ్‌లో సమంత వరుస సంతోషాలతో మునిగితేలుతుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News