E-PAPER

మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్.. తొలిసారి క్లీంకార ఫేస్ రివీల్ చేసిన చెర్రీ దంపతులు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి, మెగా ప్రిన్సెస్ ‘క్లీంకార కొణిదెల’ ముఖాన్ని చూడాలన్న అభిమానుల మూడేళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. పాప ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యమిచ్చే ఈ జంట.. ఇప్పటివరకు క్లీంకార ఫేస్ మీడియా కెమెరాల కంటికి చిక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, తాజాగా ఆమె మూడో పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఫోటోను పంచుకుంటూ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఈ ఫొటోలో క్లీంకార స్కై బ్లూ కలర్ ఫ్రాక్‌లో ఎంతో క్యూట్‌గా నవ్వుతూ కనిపిస్తుండగా, చరణ్-ఉపాసన తమ గారాల పట్టిని చూస్తూ మురిసిపోతున్నారు. క్లీంకార పూర్తి ముఖం స్పష్టంగా కనిపించేలా వచ్చిన మొట్టమొదటి అధికారిక చిత్రం ఇదే కావడంతో నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారింది. పాప బుగ్గల నిండా నవ్వుతో అచ్చం తండ్రి రామ్ చరణ్ పోలికలతోనే ఉందంటూ మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కొందరు నెటిజన్లు క్లీంకార కళ్లు చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి గారిని గుర్తుకు తెస్తున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక రామ్‌చరణ్ కెరీర్ విషయానికొస్తే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆయన నటించిన ‘పెద్ది’ చిత్రం ఈ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.400 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘పెద్ది’ రామ్‌‌చరణ్ సోలో కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఎంతటి గ్లోబల్ స్టార్ అయినప్పటికీ ఇంటికి రాగానే తాను కేవలం క్లీంకార తండ్రిగానే మారిపోతానని చరణ్ గతంలో పలుమార్లు చెప్పుకొచ్చారు. మెగా వారసురాలిని స్వయంగా పూర్తి ముఖంతో పరిచయం చేయడంతో ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయి లైకులతో ట్రెండ్ అవుతోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News