E-PAPER

పి.పి.పి విధానం రద్దు చేయాలి.. మున్సిపల్ కార్మికుల ధర్నా

పలాస, జూన్ 19 (వై7 న్యూస్):

మున్సిపాలిటీలో సేవలను పి.పి.పి (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో ప్రైవేటీకరించేందుకు తీసుకొచ్చిన జీఓ నంబర్లు 975, 673లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలాస మున్సిపల్ కార్మికులు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్. గణపతి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె. వెంకటి, బి. కుర్మారావు మాట్లాడుతూ శాశ్వత పనుల్లో ప్రైవేటీకరణ విధానాలను అమలు చేయడం వల్ల కార్మికులు ఉద్యోగ భద్రత కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం “సమాన పనికి సమాన వేతనం” అమలు చేయాలని, అలాగే 2018లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ .ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసుకు అందజేశారు. 2011-12 సంవత్సరాలకు సంబంధించిన 20 నెలల పీఎఫ్ బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, 2024లో జరిగిన ఏడు రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సి.హెచ్. మురుగన్, కె. ఈశ్వరరావు, అమర్, కె. బాలు, భాస్కర్, తిరుపతి, సావిత్రి, గులాబీ, భాను, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

 

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News