శ్రీకాకుళం పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 55 ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.వి. రమణ, పి. శ్రీనివాసరావు పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను విన్నారు.
ఫిర్యాదులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని త్వరితగతిన, న్యాయపరంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ గ్రీవెన్స్‌లో భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు, మోసపూరిత ఘటనలు మరియు సివిల్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Post Views: 14









