E-PAPER

పలాసలో ఘనంగా “2 ఏళ్ల నమ్మకం – విజయోత్సవం” కార్యక్రమం

పలాస ;
పలాస నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా “2 ఏళ్ల నమ్మకం – విజయోత్సవ కార్యక్రమం” పలాస శాసన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచాయని పేర్కొన్నారు.పలాస నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ విజయోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News