పలాస మండలం కోసంగిపురం గ్రామంలో ఈ రోజు (16.06.2026) కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ R. నరసింహమూర్తి గారు మరియు సిబ్బంది కలిసి గ్రామ సందర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి నారీ శక్తి, కొత్త చట్టాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. గ్రామంలో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చ్లకు భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అదేవిధంగా గ్రామంలో పండుగలు, ఉత్సవాలు నిర్వహించినప్పుడు ముందస్తుగా పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా మరియు విక్రయం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
బాల్యవివాహాలు, మహిళలపై జరిగే నేరాలు, 112 ఎమర్జెన్సీ నంబర్ వినియోగం వంటి ముఖ్య విషయాలపై కూడా ప్రజలకు వివరించారు. గ్రామ భద్రతను బలోపేతం చేయడానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.









