శ్రీకాకుళం జిల్లా పలాస | వై 7 న్యూస్ | జూన్ 15
పలాసలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కుసుమ మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో 33% రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పలాస ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చరాదని, ఇటీవల తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని వారు కోరారు. అలాగే పని గంటలు పెంచకూడదని, చేసిన పనికి తగిన వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Post Views: 6








