E-PAPER

తర్లకోట గ్రామ సందర్శన – అవగాహన కార్యక్రమం

కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. ఆర్. నరసింహమూర్తి ఆధ్వర్యంలో 14.06.2026 తేదీన పలాస మండలం తర్లకోట గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మరియు పోలీస్ సిబ్బంది గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పలు ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా నారీ శక్తి, కొత్త చట్టాలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల బాధ్యతలు గురించి వివరించారు. గ్రామంలో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా స్థలాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరంను సూచించారు. అలాగే గ్రామంలో జరిగే పండుగలు, ఉత్సవాల సమాచారం ముందుగా పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని గ్రామస్తులకు సూచించారు.

అదేవిధంగా, ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా మరియు విక్రయం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, అత్యవసర పరిస్థితుల్లో 112 ఎమర్జెన్సీ నెంబర్ వినియోగం గురించి కూడా వివరించారు.

గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజలు పోలీస్ శాఖతో సహకరించాలని ఎస్.ఐ. ఆర్. నరసింహమూర్తి గారు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News