శ్రీకాకుళం జిల్లా పలాస వై 7 న్యూస్ జూన్ 12
పలాస నియోజకవర్గంలో ఎయిర్ పోర్టు కు ముందుడుగు.
పలాస నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టుకు అవసరమైన భూముల సేకరణ నేపథ్యంలో బిడిమి, బహడపల్లి, బేతలపురం, రాంపురం, లక్ష్మీపురం, గంగువాడ గ్రామాల రైతులతో పలాస ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీవో గారు మరియు ఇతర అధికారులతో కలిసి పాల్గొనటమైనది.
ఈ సందర్భంగా…
రైతుల తరఫున భూముల నష్టపరిహారం, తోటల పరిహారం, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై జరిగిన చర్చల్లో అధికారులు ఇచ్చిన హామీల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన పలువురు రైతులు తమ సమ్మతిని తెలియజేస్తూ భూములు ఇవ్వడానికి అంగీకరించారు. అలాగే మిగిలిన రైతులకు కూడా పూర్తి వివరాలు తెలియజేసి, ఎయిర్పోర్టు నిర్మాణ ప్రక్రియ వేగవంతం కావడానికి సహకరిస్తామని వెల్లడించారు.
ఈ పరిణామంతో పలాస ఎయిర్పోర్టు నిర్మాణానికి మరింత ముందడుగు పడింది. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మిగిలిన రైతులు కూడా ముందుకు వచ్చి ఈ మహత్తర ప్రాజెక్టుకు సహకరించాలని కోరాను. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాను.
రైతులు ప్రస్తావించిన సమస్యలు, సూచనలపై జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ, రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో చర్చించి ముందుకు సాగుతామని, ఆయా గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశానికి హాజరైన రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎయిర్పోర్టు నిర్మాణం ద్వారా ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.








