శ్రీకాకుళం జిల్లా, పలాస, జూన్ 13 (వై7 న్యూస్):
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునిఅల్తాడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లాండ జగదీష్ (38) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వజ్రపుకొత్తూరు ఎస్సై నిహార్ తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా నిత్యం మద్యం సేవిస్తున్న జగదీష్‌ను ఆయన భార్య భారతి మందలించడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అనంతరం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
Post Views: 23









