వై7 న్యూస్ | పలాస | తేదీ: 22
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ అక్రమ నిల్వలపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కాశీబుగ్గ నిత్యానందనగర్ ప్రాంతంలోని పలు ప్లాస్టిక్ గోదాములపై తనిఖీలు చేపట్టి భారీగా నిషేధిత ప్లాస్టిక్ సంచులు మరియు ప్లాస్టిక్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
సుమారు 300 కిలోల ప్లాస్టిక్ వస్తువులను ప్రత్యేక వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. నిబంధనలు ఉల్లంఘించిన గోదాం యాజమాన్యాలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం నిషేధిత ప్లాస్టిక్ వినియోగం, నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇటువంటి దాడులు కొనసాగుతాయని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.
Post Views: 8








