ఢిల్లి:
దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఈ ఎన్నికల్లో ముఖ్య నేతల భవితవ్యం తేలనుంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎం.కే. స్టాలిన్, అస్సాంలో హిమంత బిశ్వ శర్మ, కేరళలో పినరయి విజయన్ రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు భిన్నంగా రావడంతో ఫలితాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకృతమైంది. పశ్చిమ బెంగాల్‌లో 294, తమిళనాడులో 234, అస్సాంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న Election Commission of India అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ బెంగాల్‌లో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కౌంటింగ్ సూపర్వైజర్లుగా నియమించొద్దని చేసిన మమతా బెనర్జీ విజ్ఞప్తిని Supreme Court of India తిరస్కరించింది.
పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో 93 శాతం పోలింగ్ నమోదవగా, ఎస్‌ఐఆర్ తర్వాత జరిగిన ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఓట్ల తొలగింపు ప్రభావం ఎవరి పై పడుతుందో అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.








