E-PAPER

భద్రాచలం సి.ఎస్‌.ఐ చర్చిలో పూణెం కృష్ణ, చింత్రియాల రవికుమార్‌కు ఘన సన్మానం

భద్రాచలం, మే 3, 2026:
భద్రాచలం పట్టణంలోని సి.ఎస్‌.ఐ చర్చిలో ఆదివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చర్చి పెద్దల ఆహ్వానం మేరకు భద్రాచలం సర్పంచ్ పూణెం కృష్ణ, నాయకుడు చింత్రియాల రవికుమార్‌లను శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా చర్చి పెద్దలు మాట్లాడుతూ, ప్రజాసేవలో వారి కృషి ప్రశంసనీయమని కొనియాడారు. సమాజ అభివృద్ధికి వారు చేస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, యువ నాయకులు, సి.ఎస్‌.ఐ చర్చి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సన్మానితులను అభినందించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News