E-PAPER

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ – 25 వినతుల స్వీకరణ

పలాస:
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 25 వినతులను స్వీకరించారు. ముఖ్యంగా భూ వివాదాలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంత రహదారి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, పెన్షన్ మంజూరు, తక్కువ విద్యుత్ వోల్టేజ్, తాగునీటి సరఫరా లోపాలు వంటి పలు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.వినతులను శ్రద్ధగా పరిశీలించిన నాయకులు, ప్రతి సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News