పలాస: కార్మిక దినోత్సవం (మే 1) సందర్భంగా పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు. ఈ క్యాంప్‌కు కాశిబుగ్గ, పలాస పరిసర ప్రాంతాల నుండి సుమారు 900 మంది ప్రజలు హాజరై వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ కార్యక్రమాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా పాల్గొని క్యాంప్ నిర్వహణను అభినందించారు.
మొత్తం 30 మంది డాక్టర్ల బృందంతో ఈ మెడికల్ క్యాంప్‌ను నిర్వహించారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం పట్ల నిర్వాహకులను స్థానికులు అభినందించారు.కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని సేవలందించారు. ప్రజలకు ఆరోగ్య సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని నిర్వాహకులు తెలిపారు.
Post Views: 23








