ఖమ్మం, ఏప్రిల్ 27:
ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన దివాకర టి.ఎస్‌ను టీడబ్ల్యూజెఎఫ్ (H-2843) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, కార్యదర్శి అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ— 2017లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు జిల్లాల్లో నిర్దోషంగా సేవలందించిన దివాకర, ఖమ్మం జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు సమానంగా ఖమ్మాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.
జర్నలిస్టులు సమాజానికి నాలుగో స్థంభంగా ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల భూమిని ఇండ్ల స్థలాలుగా మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు అందించాలని, అలాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీలు కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
బడుగు, బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజెఎఫ్ కోశాధికారి వేములకొండ రమేష్, ఉపాధ్యక్షులు కందరబోయిన నాగకృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు, టీబీజేఎ జిల్లా కార్యదర్శి కాసోజు శ్రీధర్, టిడబ్ల్యూజెఎఫ్ నగర అధ్యక్షుడు గంటేల కుమార్, టీబీజేఎ నగర సహాయ కార్యదర్శి చిన్నంశెట్టి రాంబాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








