E-PAPER

మణుగూరు వరకు రైళ్ల పొడిగింపు ప్రతిపాదన పరిశీలనలో..

మనుగూరు:ఈటెల రాజేందర్ విజ్ఞప్తిపై మణుగూరు వరకు రైళ్ల పొడిగింపు అంశం కేంద్ర రైల్వే శాఖ దృష్టికి వెళ్లింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ లేఖ రాశారు.
ఏప్రిల్ 1, 2026న ఎటల రాజేందర్ పంపిన లేఖను ప్రస్తావిస్తూ, ట్రైన్ నం. 17033/17034 భద్రాచలం – బాలహర్షా ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో రెండు రైళ్లను మణుగూరు వరకు పొడిగించే ప్రతిపాదనను పరిశీలనకు పంపినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై నిర్వహణ పరమైన సాధ్యతపై పరిశీలన కొనసాగుతోందని, అది పూర్తయ్యాక తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.మణుగూరు ప్రాంత ప్రజలు చాలా కాలంగా రైలు సదుపాయాల విస్తరణ కోరుతున్న నేపథ్యంలో, ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News