మణుగూరు: పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గురిజాల గోపి శుక్రవారం పరామర్శించారు.
ఇటీవల అనారోగ్యానికి గురైన రేగా కాంతారావు హైదరాబాద్‌లో చికిత్స పొందిన అనంతరం స్వగ్రామమైన కరకగూడెంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న గురిజాల గోపి రాజకీయాలకు అతీతంగా కరకగూడెం చేరుకుని రేగా కాంతారావును కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనతో కొద్దిసేపు ముచ్చటించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా మానవత్వాన్ని మరువకూడదని గురిజాల గోపి పేర్కొన్నారు.
రేగాను పరామర్శించిన వారిలో రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ, సభ్యులు ఎండి షబానా, కోరి శ్యామల, రెడ్డిబోయిన రేణుక, డేరంగుల సుజాత, బాడిష పార్వతి, సౌజన్య డాకూరి తదితరులు పాల్గొన్నారు.








