E-PAPER

గొర్రెల మందపై దూసుకెళ్లిన కోళ్ల వ్యాన్… 40 గొర్రెల మృతి

మణుగూరు ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సీఎస్పీ సమీపంలో హృదయ విదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో గొర్రెల మందను మేపుతూ రోడ్డుపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ ఒక్కసారిగా గొర్రెలపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో సుమారు 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొన్ని గొర్రెలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొన్ని గొర్రెలకు కాళ్లు విరిగిపోవడం, పొట్టలు పగిలిపోవడం వంటి దారుణ పరిస్థితులు చోటుచేసుకోవడంతో దృశ్యాలు చూసిన వారంతా తీవ్రంగా కలత చెందుతున్నారు.
మృత్యువాత పడిన గొర్రెలతో పాటు, కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న గొర్రెలను చూసి రాకపోకలు చేసే ప్రయాణికులు చలించిపోయారు.
గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేస్తూ…
డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. మేము తీవ్రంగా నష్టపోయాం” అని తెలిపారు.
అదృష్టవశాత్తూ నేను తప్పించుకున్నాను… లేదంటే నేను కూడా ప్రాణాలు కోల్పోయేవాడిని” అని కన్నీరు పెట్టుకున్నారు.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News