వై 7 న్యూస్ పలాస
పలాస మండలం రామకృష్ణపురం గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించి అగ్ని ప్రమాద సమయంలో ఎలా స్పందించాలో ప్రాక్టికల్‌గా చూపించారు.
గ్యాస్ వినియోగంలో పొంచి ఉన్న ప్రమాదాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ, ప్రమాదం సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవించినపుడు సురక్షితంగా బయటపడే మార్గాలు, అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన చర్యలను తెలియజేశారు.
అదేవిధంగా గ్యాస్, విద్యుత్ సంబంధిత ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, ప్రతి ఒక్కరూ అవగాహనతో వ్యవహరిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
Post Views: 6








