E-PAPER

ఉప ముఖ్యమంత్రి భట్టిని కలిసిన కామేపల్లి నాయకులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి సహా పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కామేపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, మాజీ ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి జగన్నాథ్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ మాలత్ బౌవసింగ్, నల్లమోతు వెంకట నరసయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యమయ్య తదితరులు ఉప ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో రైతుల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. నాయకులందరికీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలియజేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News