ఖమ్మం కార్పొరేషన్, ఏప్రిల్ 16: నిన్న సూర్యాపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మహ్మద్ జావేద్ పార్థివ దేహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళి అర్పించారు.
ఖమ్మం పట్టణంలోని రెడ్ హిల్స్‌లో ఉన్న జావేద్ గారి స్వగృహానికి చేరుకున్న మంత్రి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జావేద్ కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు.
పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా మిగిలిపోతుందని మంత్రి పేర్కొన్నారు. జావేద్ సేవలను స్మరించుకుంటూ మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు.
Post Views: 172








