E-PAPER

పలాసలో ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం – కాపర్ వైర్లు చోరీ

వై7 న్యూస్ పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ హైవే సమీపంలోని మున్సిపాలిటీ పరిధిలో మరోసారి దొంగల బీభత్సం చోటుచేసుకుంది. తాగునీటి కోసం బావికి విద్యుత్ సరఫరా అందించేందుకు ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారు.
మంగళవారం అర్ధరాత్రి సమయంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన వైర్లు కట్ చేసి, లోపల ఉన్న సుమారు రూ. 3 లక్షల విలువైన కాపర్‌ను అపహరించినట్లు సమాచారం. ఉదయం ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాన్స్‌ఫార్మర్ పరిస్థితిని పరిశీలించి, కేసు నమోదు చేశారు. దొంగలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
స్థానికులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇటువంటి చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గస్తీని పెంచాలని కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News