కొత్తగూడెం లీగల్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు.
ఇప్పటివరకు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఎస్. సరితకు తాత్కాలికంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించినట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అదే సమయంలో వరంగల్‌లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఉన్న జి. ప్రేమలతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ బదిలీలతో జిల్లా న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Post Views: 82








