E-PAPER

మొక్కజొన్న రైతులకు బాసట మద్దులపల్లి మార్కెట్‌లో కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఖమ్మం :
రైతులు పండించిన ప్రతి గింజకు న్యాయమైన మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, మున్సిపల్ చైర్మన్ పోకబత్తిని అనితతో కలిసి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు మద్దతు ధర కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని తెలిపారు.

అనంతరం కూసుమంచి మండలం లోక్య తండా గ్రామంలో జరిగిన పలు వివాహ వేడుకలకు తుంబూరు దయాకర్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారుడు దండి రామారావు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News