E-PAPER

కామాంధుడి క్రూరత్వం… మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య!

వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివేకానంద

వై 7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లాలో హిరమండలంలో జరిగిన దారుణ ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. మానవత్వాన్ని మరిచిపోయేలా జరిగిన ఈ ఘటనలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
మార్చి 25న జరిగిన ఈ ఘటనలో వెంకటరమణ అనే వ్యక్తి మైనర్ బాలికను మాయమాటలు చెప్పి విశాఖపట్నం నగరంలోని సుజాతనగర్‌కు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది. అక్కడ తన అపార్ట్మెంట్‌లో ఆమెపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ కేసుపై డీఎస్పీ వివేకానంద బుధవారం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. నిందితుడు హత్య అనంతరం బాలిక మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుని వచ్చి కారులో పెట్టినట్లు విచారణలో బయటపడిందని తెలిపారు.
తరువాత మృతదేహాన్ని తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News