వై 7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస:సంతబొమ్మలి మండలం మూలపేటలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ పోర్ట్‌ను సందర్శించేందుకు భారీగా తరలిరావాలని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు.
బుధవారం పలాస ప్రగతి భవన్‌లో వైసీపీ శ్రేణులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.
ఈ నెల 30వ తేదీన జరగనున్న పోర్ట్ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు
Post Views: 9








