వై 7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరులో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) భవనాన్ని పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు గారు హాజరయ్యారు.
అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్ గారు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు గారు, పలాస మండలం PACS అధ్యక్షుడు వంకల కుర్మారావు గారు, వజ్రపుకొత్తూరు PACS అధ్యక్షుడు కణితి సురేష్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దువ్వాడ హేంబాబు చౌదరి గారు, బుల్లోజు శశిబూషణ్ గారు తదితర పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 11








