E-PAPER

భద్రాచలంలో భక్తులకు ఉచిత పులిహోర, మజ్జిగ పంపిణీ

భద్రాచలం:
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా పులిహోర, మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ బాబు తోటమల్ల, ప్రధాన కార్యదర్శి కుప్పాల నాగరాజు, గౌరవ అధ్యక్షుడు కర్ర అనిల్ రెడ్డి, కార్యదర్శి గుమ్మడపు దుర్గాప్రసాద్ లు సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

శుక్రవారం ఉదయం భద్రాచలం పట్టణంలోని ఉదయభాస్కర్ సెంటర్ కూడలి వద్ద, SD మెడికల్ షాప్ ముందు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించాలని వారు కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News