మణుగూరు ;
నేడు ఉగాది పండుగ సందర్భంగా మణుగూరు పట్టణంలో రాష్ట్రీయ స్వయంసేవ సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ డ్రెస్సెస్ వద్ద ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని పచ్చడి స్వీకరించారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేయడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ పచ్చడిలో ఉన్న ఆరు రుచులు మన జీవితంలోని సుఖదుఃఖాలను సూచిస్తాయని, ప్రతి పరిస్థితిని సమానంగా స్వీకరించాలని సూచిస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
Post Views: 54









