వై 7 న్యూస్ | పలాస
పలాస పట్టణంలో ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే జామి ఎల్లమ్మ తల్లి జాతర ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు కొల్లకోట వంశీయులు ఒక ప్రకటనలో తెలిపారు.జాతర కార్యక్రమాల్లో భాగంగాఈ నెల 24న అగ్నిగుండం,25న సింధూరపంట,26న ప్రధాన జాతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.ఈ జాతరకు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు సమీప జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని నిర్వాహకులు తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Post Views: 17









