వై 7 న్యూస్ పలాస
నందిగాం మండలం కర్లపూడి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఏం. ఖాగేశ్వరరావు (25) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికుల వివరాల ప్రకారం… హుకుంపేటలో నివాసముంటున్న ఖాగేశ్వరరావు ద్విచక్ర వాహనంపై చిన్న తామరపల్లి–కర్లపూడి మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రత కారణంగా యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు.మృతుడి స్వస్థలం సంతబొమ్మాళి మండలంలోని పాలతలగాం గ్రామంగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న నందిగాం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Post Views: 27









