వై 7 న్యూస్ పలాస
వార్డ్ ఇన్చార్జీలతో సమీక్షా సమావేశం
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు.
ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, 31 వార్డుల కౌన్సిలర్లు మరియు వార్డ్ ఇన్చార్జీలతో సమావేశం నిర్వహించి, తాగునీటి సరఫరాపై విస్తృతంగా చర్చించారు.
ప్రణాళికాబద్ధంగా అవసరమైన నిధులు సమకూర్చడంతో పాటు, ప్రజలను కూడా భాగస్వాములుగా చేసుకుని తాగునీటి కొరత లేకుండా నిరంతర సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో సమీక్షించారు.వేసవిలో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.
Post Views: 15









