వై 7 న్యూస్ | పలాస
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష బుధవారం విస్తృతంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో 4వ వార్డు రాజాం కాలనీలో నిర్మించిన నూతన సామాజిక భవనాన్ని ప్రజలకు అంకితం చేశారు.
అలాగే 17వ వార్డులో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించగా, 13వ వార్డులో రూ.4 లక్షలు, 5వ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో నూతన రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు స్థానిక మహిళలు హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని, పలాసను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే శిరీష తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.








