మెదక్ తూప్రాన్ న్యూస్ జనవరి 13:-
రోడ్డు భద్రత మాసం సందర్భంగా తూప్రాన్ సీఐ రంగ కృష్ణ తూప్రాన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు జ్యోతి యాదగిరి లతో కలిసి తూప్రాన్ పట్టణంలో “అరైవ్ అలైవ్” అనే రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తూప్రాన్ సీఐ రంగకృష్ణ మాట్లాడుతూ…. రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం సీటు బెల్ట్ వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగం నివారించాల్సిన అవసరం వంటి ముఖ్య అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాల గురించి వివరించారు.ఈ సందర్భంగా కొన్ని రోడ్డు ప్రమాదాల బాధితులు తమ వ్యక్తిగత అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, మానసిక వేదనలను ప్రజలతో పంచుకుని, రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో తెలియజేశారు. వారి అనుభవాలు ప్రజలపై గాఢమైన ప్రభావం చూపాయని పోలీసులు తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలు రోడ్డు భద్రతపై మరింత బాధ్యతగా వ్యవహరించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకునే విధంగా వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచించారు.









