వై 7 న్యూస్ | పలాస
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక వాసుదేవ పెరుమాళ్ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునుంచే ఆలయానికి చేరుకున్న భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కూర్మచార్యులు ఆధ్వర్యంలో శ్రీ వాసుదేవునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం (వైకుంఠ ద్వార దర్శనం) ఏర్పాటు చేయగా, పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుని పుణ్యఫలితాలు పొందారు.
పండుగ నేపథ్యంలో ఆలయ కమిటీ ముందస్తు ఏర్పాట్లు చేపట్టడంతో దర్శనాలు సాఫీగా జరిగాయి. భక్తుల నామస్మరణలు, హరిభజనలతో మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయం ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి మరింత శోభను సంతరించుకుంది.
Post Views: 32









