వై 7 న్యూస్ పలాస
కాశీబుగ్గ డివిజన్ నూతన డీఎస్పీగా షేక్ షాహాబాద్ అహ్మద్ శుక్రవారం కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సమస్యలపై సమగ్ర అవగాహన పెంపొందించుకొని, పోలీస్ సిబ్బందితో సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. చట్టసౌకర్యాలు కాపాడుతూ, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించే పోలీస్ వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
పాడేరు నుంచి బదిలీపై కాశీబుగ్గకు వచ్చిన షేక్ షాహాబాద్ అహ్మద్, ఇక్కడి ప్రజల సహకారంతో సమర్థవంతమైన పోలీస్ పరిపాలన అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Post Views: 46









