పాల్వంచ;
పాల్వంచ మండలంలో డిసెంబర్ 14న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సత్యనారాయణపురం గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొందిన సర్పంచ్ జర్పుల సంధ్య, ఉప సర్పంచ్ వేముల నరేష్, వార్డు మెంబర్లు పసల దుర్గ, పసల భాస్కర్, అన్నం మంజుల బిఆర్ఎస్ జిల్లా నాయకులు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కనకేష్ పటేల్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు బిఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
సర్పంచ్ జర్పుల సంధ్య, ఉప సర్పంచ్ వేముల నరేష్‌లు మాట్లాడుతూ పార్టీ సహాయ సహకారాలతోనే తమ గెలుపు సాధ్యమైందని, గ్రామ సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్నం ప్రభాకర్, వేముల ఐలయ్య, తోటలోహి సాయి తదితరులు పాల్గొన్నారు.









