మెదక్ తూప్రాన్ డిసెంబర్ 18:
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో మంగళవారం జరిగిన బాయిలర్ బట్టి పేలుడులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో కార్మికుడు అర్ధరాత్రి మృతి చెందాడు.అయితే అతను బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్ పాండేగా గుర్తించారు.కాగా మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు,ఒక కుమారుడు ఉన్నాడు.ఎంఎస్ అగర్వాల్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరుకోవడంతో కంపెనీ యజమాని పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని గ్రామస్తులు, సిపిఎం నాయకులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
Post Views: 40









