E-PAPER

శ్రీ సత్యసాయి బాబావారి శతవర్షజయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో తృతీయ స్థానం

వై 7 న్యూస్ | పలాస

శ్రీ సత్యసాయి బాబావారి శతవర్షజయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో శ్రీ సత్యసాయి విద్యావిహార్, రామక్రిష్ణపురం విద్యార్థి చి. విజయకుమార్ తృతీయ స్థానం సాధించి ఘనత సాధించారు.

ఈ సందర్భంగా శ్రీకాకుళంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో విజేతకు సర్టిఫికేట్ మరియు షీల్డ్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు , జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు , విద్యావిభాగపు సమన్వయకర్త శ్రీ శశికాంత్ గారు, శ్రీమతి సూర్యకల గారు, అలాగే జిల్లా మరియు జోనల్ స్థాయి పదాధికారులు పాల్గొన్నారు.

విద్యార్థి విజయకుమార్ సాధించిన ఈ విజయం పాఠశాలకే కాకుండా జిల్లాకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News