▪️కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపి రామసహాయం పిలుపు
▪️సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించండి
▪️లక్ష్మిదేవిపల్లి మండలంలో ఖమ్మం ఎంపి ఆర్ఆర్ఆర్ విస్తృత పర్యటన
కొత్తగూడెం/ లక్ష్మిదేవిపల్లి జులై 01( వై 7 న్యూస్ );
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఖమ్మం ఎంపి రామ సహాయం రఘు రాంరెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్ష్మిదేవిపల్లి మండలం బంగారు చెలక, మైలారం, గట్టుమల్ల, రేగళ్ల, లక్ష్మిదేవిపల్లి, చాతకొండ, సీతారాంపురం, తెలగరామవరం, హేమచంద్రాపురం ఉమ్మడి పంచాయతీల పరిధిలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘు రాంరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్లమురళి, తూము చౌదరి, పెద్దబాబు లతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఎంపి కి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. 10ఏళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులకు ఎలా బుద్ది చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం ఇచ్చారో అదే రీతిలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన వారిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.22వేల కోట్లతో రైతు భరోసాను అమలు చేసిందని, రూ. 12వేల కోట్లతో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తోందని, 55 లక్షల ఇండ్లకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, ఉచిత బస్సు పథకానికి 4 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గతంలో పదేళ్లు ఉన్న బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేసిందేమీ లేదని.. కుంగిన, కూలిన కాళేశ్వరం, దరిద్రమైన ధరణి మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి గౌస్ పాషా, మాజీ పాక్స్ డైరెక్టర్ కూచిపూడి జగన్, ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్స్ ఎండి రజాక్, రైల్వే బోర్డు మెంబెర్ శ్రీనివాస్ రెడ్డి, టెలికం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు, లక్ష్మిదేవిపల్లి మండల కాంగ్రెస్ నాయకులు వరుస నరసింహారావు, పెట్టి ఎంకన్న, పూసమ్ సత్యనారాయణ, బుర్ర శంకర్, పాయం లక్ష్మీనరసు, బరపాటి శ్రీను, పట్టాభి, రమణారెడ్డి, బట్టు రమేష్, నరేష్, దేవరగట్ల ప్రసాద్, కొంపల్లి వీరయ్య, దయ్యాల సమ్మయ్య, ఉబ్బని రాజు, వజ్జా చందు, బోయిన్పల్లి రాము, మైనార్టీ నాయకులు అయూబ్ ఖాన్, అప్సర్ ఖాన్, అంతడుపుల కృష్ణ, సూరిబాబు, జరీనా, రమ, కొత్తగూడెం కాంగ్రెస్ నాయకులు బాలపాసి, బాలిశెట్టి సుందర్ రాజ్, పోస్ట్ ఆఫీస్ శ్రీను,గొల్ల శ్రీను, యూత్ కాంగ్రెస్ నాయకులు తాటి పవన్, కసనబోయిన రామ్మూర్తి, మాజీ సర్పంచ్ లు చింతా సుజాత, బాధవత్ అనూష, పూనెం సంధ్య, పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు.