గుండాల జూన్ 03(వై సెవెన్ న్యూస్):
పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు గుండాల మండలంలో మంగళవారం నాడు పర్యటించారు. పర్యటనలో భాగంగా గుండాల మండల కేంద్రంలో ప్రాథమిక హాస్పిటల్ని సందర్శించి సిబ్బంది పని తీరును ఆరా తీశారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే హాస్పిటల్ కి ఎలాంటి సదుపాయాలు అవసరం ఉన్నా తనను సంప్రదించాలని ప్రజా వైద్యం కోసం హాస్పిటల్ కి 25లక్షల రూపాయలు కేటాయిస్తునట్టు ప్రకటించారు. అలాగే
62 లక్షల అంచన ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
నియోజకవర్గ అభివృద్ధి కొరకు కోట్ల రూపాయలు నిధులు సమకూర్చి నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని తెలియజేశారు. అనంతరం సాయనపల్లి గ్రామపంచాయతీకి చెందిన వాగబోయిన రాములు మరియు వెంకటరమణ గార్ల కుమార్తె ఉమా రాణి ప్రధాన వేడుకలో పాల్గొని పెళ్లి కూతురు ని ఆశీర్వదించడం జరిగింది.అనంతరం కాచనపల్లి గ్రామానికి చెందిన సీపీఐ ఎంల్ మాస్ లైన్ ప్రజాపంథా నాయకుడు పర్షిక లక్ష్మయ్య గత కొద్ది రోజుల క్రితం మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, గుండాల మండల కాంగ్రెస్ పార్టీ PSR-PVR మండల కోఆర్డినేటర్ ఖదీర్, AMC డైరెక్టర్ ఊకె బుచ్చయ్య , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అశోక్ , మాజీ ఎంపీపీ చాట్ల పద్మ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.









