పలాస,వై7 న్యూస్
ప్రయాణికుల సురక్షత కోసం మరో ముందడుగు వేసిన కాశీబుగ్గ పోలీసులు, ఆటోల్లో QR కోడ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. నేర నియంత్రణకు తోడుగా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల వివరాలను తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని పోలీస్ అధికారులు తెలిపారు.
గురువారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, పలుసంఖ్యలో ఆటోలకు సురక్ష QR కోడ్ స్టికర్లు అంటించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రయాణికులు తమ ఫోన్లో స్కాన్ చేయగలిగేలా ఉండే ఈ స్టికర్లతో ఆటోల్లో సురక్షితమైన ప్రయాణానికి అవకాశమవుతుంది.
ఈ చర్యతో ప్రయాణికులకు భద్రతా విశ్వాసం కలుగుతుందని అధికారులు తెలిపారు. పోలీసులు తీసుకున్న ఈ ముందడుగు ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటోంది.
Post Views: 124









