బాన్సువాడ మే 28 (వై సేవ న్యూస్ ప్రతినిధి );
బాన్సుల మండల కేంద్రంలోని
రక్త దానం చేసిన ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ నాయకులు బాన్సువాడ ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ లో గర్భిణీ స్త్రీల నిమిత్తం కోసం ఏఎసార్ ఫౌండేషన్ నాయకులు షేక్ అహ్మద్ రక్త దానం చేసారు. ఈ సందర్బంగా ఏఎస్ఆర్ ఫౌండేషన్ నాయకులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ 18 – 60 ఏళ్ళ వయసున్న వారు ఎవరైనా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, తద్వారా రెండు ప్రాణాలను కాపాడే ప్రాణ దాతలు అవుతారని అన్నారు. రక్తం ఇవ్వడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉండటం, కోలేష్ట్రాల్ తగ్గడం, గుండెపోటు రాకుండా నివారించడం, వ్యాధినిరోధక శక్తి పెరగడం వంటి ప్రయోజనాలు ఉంటాయని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.
Post Views: 41









