మణుగూరుకు చెందిన వ్యక్తి అరెస్ట్….
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , మే 26 (ప్రత్యేక ప్రతినిధి):
మహబూబాబాద్ నుండి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసుల భద్రతా తనిఖీల్లో ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. మణుగూరుకు చెందిన బాలు అనే వ్యక్తి తాను విక్రయిస్తున్న మద్యం సిండికేట్ ద్వారా అధిక ధరలకు అమ్మేందుకు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఇల్లందులో చోటు చేసుకుంది. బాలు మహబూబాబాద్ నుంచి తన కారులో (TS28M 7477) భారీ మొత్తంలో మద్యం తరలిస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేసిన పోలీసులకు కారులో మూడు లక్షల ఏడువేల రూపాయల విలువచేసే మద్యం కట్రూన్లు, ప్యాకెట్లు, మరియు మద్యం బాటిళ్లు కనిపించాయి. ఈ మద్యంను స్థానికంగా అధిక ధరలకు విక్రయించే కుట్ర భాగంగా తరలించారని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం నిబంధనలు ఉల్లంఘించినందుకు బాలుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.