E-PAPER

టేకులపల్లి పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

టేకులపల్లి, వై 7 న్యూస్

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సోమవారం టేకులపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి వెంటనే విచారణ చేపట్టి పరిష్కరించే విధంగా కృషి చేయాలని అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :