వై 7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పలాస నడిరోడ్డుపై ఓ యువకుడిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోశాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్న యువకుడితో మరో వ్యక్తికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన వ్యక్తి యువకుడిని రోడ్డుపైకి తీసుకువచ్చి చాకుతో గొంతు కోసినట్టు సమాచారం.
ఈ ఘటనను గమనించిన షాపు యజమాని స్థానికుల సహాయంతో గాయపడిన యువకుడిని వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 17








